: ఇంద్రాణికి షీనా బోరా రాసిన లేఖలో ఏముందంటే...!

కన్న కూతురు షీనా బోరాను పాశవికంగా హత్య చేసిందన్న ఆరోపణలతో ఇంద్రాణి ముఖర్జియా జ్యూడీషియల్ రిమాండ్ లో ఉండటమే కాకుండా, సీబీఐ విచారణను కూడా ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఇంద్రాణికి షీనా రాసిన ఈమెయిల్ లేఖను సీబీఐ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. లేఖ ప్రకారం... సోదరుడి వరుసయ్యే రాహుల్ తో షీనా డేటింగ్ చేయడాన్ని ఇంద్రాణి తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఇంద్రాణికి షీనా లేఖ రాసింది. "నీకు ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో, దాన్నే నువ్వు చేశావ్. నాకు సంతోషాన్ని ఇచ్చేదాన్ని నేను వెతుక్కుంటాను. నీకు వర్తించిన అంశం నాకు కూడా వర్తిస్తుంది. నాలో కూడా కొంతవరకు నీ లక్షణాలే ఉన్నాయి. నా జీవితం గురించి నీవు బాధపడకు. నా జీవితాన్ని నన్ను బతకనివ్వు" అని లేఖలో షీనా బోరా పేర్కొంది. మరోవైపు తన సవతి తండ్రి పీటర్ ముఖర్జియాకు కూడా షీనా లేఖ రాసిందని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. "నా సమస్య అంతా ఇంద్రాణితోనే. రాహుల్ తో నా జీవితం వ్యక్తిగతం. నన్ను, రాహుల్ ను దూషించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈ విషయాన్ని ఇంద్రాణికి చెప్పి ఒప్పించండి" అని పీటర్ కు రాసిన లేఖలో షీనా పేర్కొందని అధికారులు తెలిపారు.

More Telugu News