: అవార్డులు వెనక్కివ్వడం వల్ల సమస్యలు పరిష్కారం కావు: కరీనా కపూర్

అవార్డులు వెనక్కి ఇవ్వడం వల్ల సమస్యలు పరిష్కారం కావని ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ తెలిపింది. దేశంలో సహనశీలత తగ్గిపోతోందంటూ పలువురు రచయితలు, కళాకారులు అవార్డులు వెనక్కి ఇవ్వడంపై ఆమె మాట్లాడూతూ, దేశంలో సహనశీలత గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని చెప్పింది. సహనశీలతను దేశానికి ఆపాదించినప్పుడు అది వ్యక్తిగత విషయం కాదన్న సంగతి గుర్తించాలని ఆమె సూచించింది. సహనశీలత పేరిట తన అవార్డులను వెనక్కి ఇచ్చేది లేదని ఆమె స్పష్టం చేసింది.

More Telugu News