: టీక్యా తండాలో పోలింగ్ బహిష్కరణ... భూపాలపల్లిలో మొరాయించిన ఈవీఓం

వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. నియోజకవర్గవ్యాప్తంగా నేటి ఉదయం ప్రారంభమైన పోలింగ్ కు జనం నుంచి మంచి స్పందన వస్తోంది. వరంగల్ నగరంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు వచ్చిన తొలి ఓటరుకు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ పూల బొకేతో స్వాగతం పలికారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైనా, భూపాలపల్లి పట్టణంలోని పోలింగ్ కేంద్రం నెం:17లో ఈవీఎం మొరాయించడంతో అక్కడ ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు తొర్రూరు మండలం వెలికట్టె పంచాయతీ పరిధిలోని టీక్యా తండాలో కూడా పోలింగ్ ప్రారంభం కాలేదు. అక్కడి గిరిజనులు పోలింగ్ ను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఇప్పటిదాకా ఒక్క ఓటరు కూడా రాలేదు.

More Telugu News