: ఇద్దరు ఉగ్రవాదుల హతం...దూసుకుపోతున్న భద్రతా దళాలు
వెస్ట్ ఆఫ్రికాలోని మాలి రాజధాని బమాకోలోని రాడిసన్ బ్లూ హోటలో ఉగ్రవాదుల ప్రతిఘటన మధ్య భద్రతా దళాలు నెమ్మదిగా పై చేయి సాధిస్తున్నాయి. రాడిసన్ హోటల్ లో ప్రవేశించిన భద్రతా బలగాలు నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాయి. మాలి, ఫ్రెంచ్, ఐక్యరాజ్యసమితికి చెందిన బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ లో పాలు పంచుకుంటున్నాయి. ఒక్కో అంతస్తు ఎక్కుతున్న భద్రతా బలగాలు ఉగ్రవాదుల చెరలో ఉన్న నలుగురు చైనీయులు, ఆరుగురు అమెరికన్లను విడిపించారు. ఈ క్రమంలో ఇద్దరు తీవ్రవాదులను హతమార్చారు. అంతకు ముందు 20 మంది భారతీయులను కూడా భద్రతా బలగాలు విడిపించిన సంగతి తెలిసిందే. కాగా, ఏడో అంతస్తులో ఎక్కువ మంది విదేశీయులను ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నట్టు విడుదలైనవారు చెబుతున్నారు.