: తేజస్వికి డిప్యూటీ, తేజ్ కి వైద్య ఆరోగ్య శాఖ...లాలూ కుమారులిద్దరివీ కీలక శాఖలే!
బీహార్ మంత్రి వర్గంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులిద్దరికీ కీలకమైన శాఖలను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అప్పగించారు. లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు రహదారులు, భవనాల శాఖ; పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు వైద్య ఆరోగ్యశాఖను అప్పగించారు. మంత్రి వర్గంలో కీలకమైన హోం శాఖను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకోవడం విశేషం. మహాకూటమి పొత్తుల్లో భాగంగా తేజస్వీ యాదవ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తారంటూ రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడినట్టే నితీశ్ నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా, ఇతర మంత్రి వర్గ సహచరులకు కూడా ముఖ్యమంత్రి శాఖలు కేటాయించారు.