: బీహార్ కొత్త ప్రభుత్వానికి శత్రుఘ్న సిన్హా శుభాకాంక్షలు
బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తన స్నేహితుడు నితీశ్ కుమార్ కు, ఆయన మంత్రివర్గానికి బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో "బీహార్ లో మహాకూటమి గెలవడం ప్రజాస్వామ్య విజయం. నితీశ్ బాబు సారథ్యంలోని కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు. నితీశ్ బాబు, లాలుజీ, రైజింగ్ స్టార్ రాహుల్ గాంధీ గొప్ప విజయం సాధించారు" అని షాట్ గన్ ట్వీట్ చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నితీశ్ స్వయంగా ఆహ్వానించినప్పటికీ తన వ్యక్తిగత పనుల వల్ల వెళ్లలేకపోతున్నట్టు సిన్హా ఇప్పటికే వెల్లడించారు. అందుకే సోషల్ మీడియా ద్వారా వారికి తన అభినందనలు తెలియజేశారు.