: లాలూ ఇద్దరు కొడుకులకూ మంత్రి పదవులు... బీహార్ మంత్రులు వీరే!

బీహారులో ముందుగా విశ్లేషకులు ఊహించినట్టుగా ఎమ్మెల్యేలుగా గెలిచిన లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమారులకూ మంత్రి పదవులు లభించాయి. తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ లతో పాటు అబ్దుల్ వారీద్ సిద్ధిఖీ, విజయేంద్ర ప్రసాద్ యాదవ్, రాజీవ్ రంజన్ సింగ్, అశోక్ చౌదరి, చవన్ కుమార్, జయకుమార్ సింగ్, అనూప్ కుమార్ మెహతా, చంద్రికా రాయ్, అవధేష్ కుమార్ సింగ్, నందన్ ప్రసాద్ వర్మ, మహేత్వర్ హజారీ, అబ్దుల్ జలీల్ మస్తాన్, రాంవిచార్ రాయ్, శివచంద్ర రామ్, డాక్టర్ మదన్ మోహన్ ఝా, శైలేష్ కుమార్, మంజూ వర్మ, సంతోష్ కుమార్ నిరాళా, డాక్టర్ అబ్దుల్ గఫూర్, చంద్రశేఖర్, ఫిరోజ్ అహ్మద్, మునేశ్వర్ చౌదరి, మదన్ తానే, కపిల్ దేవ్ కామత్, అనితా దేవి, విజయ ప్రతాప్ లకు మంత్రి పదవులు లభించాయి. మొత్తం 28 మందితో నితీశ్ సర్కారు కొలువుదీరగా, అందులో ముగ్గురు మహిళలకు పదవులు లభించాయి. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు 4:4:2 నిష్పత్తిలో మంత్రి పదవులు పంచుకునేందుకు ముందుగానే డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News