: టీవీ టైకూన్ పీటర్ ముఖర్జియా అరెస్టుకు కారణమిదే!

భారత కార్పొరేట్ రంగంలో సంచలనం సృష్టించిన హై ప్రొఫైల్ మర్డర్ గా గుర్తింపు తెచ్చుకున్న షీనా బోరా హత్యకేసులో, ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాను సీబీఐ నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య గురించి పీటర్ కు తెలుసునని ఇంద్రాణి తాజా విచారణలో వెల్లడించడంతోనే, దాన్ని ఖరారు చేసుకున్న సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. హత్య గురించి ఆయనకు తెలుసునని, హత్యలో పీటర్ ప్రమేయం లేనప్పటికీ, షీనా మరణించిందని తెలిసి కూడా నిందితులకు ఆశ్రయం ఇచ్చాడని, అందువల్లే ఆయన్ను అదుపులోకి తీసుకున్నామని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు తమ విచారణలో పొంతన లేకుండా ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడారని తెలిపారు. కాగా, ఈ కేసు వెలుగులోకి వచ్చిన మూడు నెలల తరువాత సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News