: మేం ఆత్మహత్య చేసుకోలేదు... ఎవరో పుకార్లు పుట్టించారు!: చింటూ తల్లిదండ్రులు

చిత్తూరు మేయర్ అనురాధ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చింటూ రాయల్ తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారంటూ వచ్చిన వార్తలను వారు ఖండించారు. తాము ఆత్మహత్య చేసుకోలేదని... ఎవరో కావాలనే ఈ పుకార్లు సృష్టించారని చింటూ తండ్రి చెప్పారు. మేయర్ దంపతుల హత్య తరువాత తమ ఆస్తులను ధ్వంసం చేశారని చెప్పారు. అందుకే తాము రక్షణ కోరుతూ పోలీసుల వద్దకు వచ్చామని తెలిపారు. తమ కుమారుడు చింటూని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

More Telugu News