: గోదావరి ఎక్స్ ప్రెస్ లో మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చి దోపిడీ!
నిన్న రాత్రి విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ ప్రెస్ లో దోపిడీ జరిగింది. హైదరాబాదుకు వస్తున్న ప్రయాణికుల నుంచి కొంతమంది దుండగులు నగదు, బంగారాన్ని చోరీ చేశారు. ఈ ఉదంతంలో దుండగులు చాకచక్యంగా పనికానిచ్చేశారు. దొంగలు ప్రయాణికుల్లా నటించి, ఓ కుటుంబంతో మాటలు కలిపి, మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చారు. అవి తాగిన వారు స్పృహ కోల్పోవడంతో వారి వద్ద నుంచి నగలు, డబ్బు, సెల్ ఫోన్ లను తీసుకుని పరారయ్యారు. దోపిడీకి గురైన వారు ఇవాళ ఉదయం వారు నాంపల్లి చేరుకున్నాక స్పృహలోకి వచ్చారు. తర్వాత తాము దోపిడీకి గురయ్యామని తెలుసుకుని లబోదిబోమంటూ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ముందు వారిని లక్డీకాపూల్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిగూడెం -ఏలూరు మధ్యలో వారికి మత్తు మందు ఇచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు.