: మోదీని పదవి నుంచి తొలగిస్తేనే భారత్, పాక్ చర్చలు: మణిశంకర్ అయ్యర్

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన పదవి నుంచి దిగితేనే భారత్, పాకిస్థాన్ ల మధ్య చర్చలు మళ్లీ ప్రారంభమవుతాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పాక్ కు చెందిన దునియా టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు తిరిగి ప్రారంభం కావాలంటే ఏం చేయాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇందుకాయన మాట్లాడుతూ, "అన్నింటికంటే ముందుగా మోదీని తొలగించాలి. ఇరు దేశాల సంబంధాలు మెరుగయ్యేందుకు ఇంతకుమించిన మార్గం లేదు. వారిని మేం తొలగించగలం. కానీ అప్పటిదాకా మీరు (పాక్) ఎదురుచూడాల్సి ఉంటుంది" అని అయ్యర్ పేర్కొన్నారు.

More Telugu News