: అనురాధ హత్య వెనుక ఎంతటి వారున్నా శిక్ష తప్పదు: చంద్రబాబు

చిత్తూరు మేయర్ అనురాధను అత్యంత దారుణంగా హత్య చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మహిళ అని కూడా చూడకుండా క్రూరంగా చంపేశారని అన్నారు. జరిగిన ఘటన అత్యంత దారుణమని, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు. కరుడుగట్టిన మనస్తత్వం గలిగిన వ్యక్తులు ఇలాంటి నీచాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ హత్య వెనుక ఎలాంటి వారున్నా, ఎంతటి వారున్నా ఉపేక్షించమని చెప్పారు. ఇలాంటి ఘటనల వల్ల సమాజంలో అలజడి చెలరేగుతుందని అన్నారు. నీచ రాజకీయాలకు పాల్పడేవారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. ఘటనా స్థలంలో ఆధారాలను ఫోరెన్సిక్ నిపుణులు సంరక్షించాలని సూచించారు.

More Telugu News