: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 36 పైసలు, లీటర్ డీజిల్ పై 87 పైసలు పెంచారు. పెరిగిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో రేపటి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.61.06 పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.46.80 పైసలుగా ఉంటుంది. కాగా, గత నెల 31వ తేదీన ‘పెట్రో’ ధరల సవరణ జరిగింది. గత ఐదు నెలల్లో పెట్రోలు ధర పెరగడం ఇది తొలిసారి. అక్టోబర్ నుంచే చూస్తే డీజిల్ ధరలు మాత్రం మూడుసార్లు పెరిగాయి.

More Telugu News