: గుడివాడ వైకాపా కార్యాలయం వివాదంలో కొడాలి నాని అరెస్ట్

కృష్ణా జిల్లా గుడివాడలోని వైకాపా కార్యాలయానికి, భవన యజమాని తాళం వేసిన ఘటనలో అనుమతి లేకుండా నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే కొడాలి నానిని పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ భవనానికి అద్దె చెల్లించడం లేదని యజమాని శశికళ తాళం వేయగా, పెద్దఎత్తున చేరుకున్న వైకాపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలోనే అక్కడకు చేరుకున్న నాని అటు శశికళతో, ఇటు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము శశికళ ఫిర్యాదుతోనే బందోబస్తు చేస్తున్నామని పోలీసులు స్పష్టం చేయడంతో, నాని రోడ్డుపై నిరసనకు దిగారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషనుకు తరలించారు.

More Telugu News