: నేటి నుంచి జేబు మరింత గుల్ల!

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రజలపై వేసిన 'స్వచ్ఛ భారత్' పన్ను నేటి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో భారతీయుల జేబుల నుంచి మరింత వదిలించుకోవాల్సిన పరిస్థితి. అన్ని రకాల సేవలపై 0.5 శాతం అదనంగా ఇచ్చుకోవాల్సిందే. అంటే, ప్రతి రూ. 100 సేవకు అర్ధ రూపాయి అధికంగా వసూలు చేస్తారు. విమాన ప్రయాణాల దగ్గర్నుంచి, హోటళ్లలో భోజనం, కరెంటు బిల్లులు, సినిమా హాళ్లు, బస్సు, రైలు ప్రయాణాలు అన్నీ ఈ పన్ను పరిధిలోకి వచ్చేశాయి. ఎవరి నుంచి ఏ రకమైన సేవలను పొందినా, ఈ అదనపు బాదుడు తప్పదు. ఇండియాను మరింత పరిశుభ్రంగా చేసేందుకు ప్రధాని తలపెట్టిన స్వచ్ఛభారత్ అమలుకు అవసరమైన నిధుల కోసం, ఈ పన్ను వేయగా, ఏటా కేంద్ర ఖజానాకు రూ. 400 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

More Telugu News