: వార్షికాదాయం రూ. 10 లక్షలు దాటితే గ్యాస్ సబ్సిడీ రద్దు!

సంవత్సరానికి రూ. 10 లక్షలకు మించిన ఆదాయం ఉన్న కుటుంబాలకు ఎల్పీజీ సబ్సిడీని తొలగించే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఇప్పటికీ దేశంలో భారీగా అక్రమ గ్యాస్‌ కనెక్షన్లున్నట్లు పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ తనకు తెలిపారని, దీన్ని అడ్డుకోగలిగితే వేల కోట్ల రూపాయలను ఖజానాకు మిగల్చవచ్చని ఆయన అన్నారు. ఇప్పటివరకూ 30 లక్షల మంది స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకున్నారని, రూ. 10 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న వారికి వంట గ్యాస్ సబ్సిడీ ఎందుకని, మంత్రులకు సబ్సిడీ ఎందుకని ఆయన ప్రశ్నించారు. వారు వదులుకున్న కనెక్షన్లను పేదలకు అందిస్తామని తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని సవరించామని, 15 రంగాల్లో ఇన్వెస్ట్ మెంట్ పరిమితులను సడలించామని ఆయన గుర్తు చేశారు. పార్లమెంటులో జీఎస్టీ వంటి కీలక బిల్లుల ఆమోదం కోసం ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.

More Telugu News