: కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ సహోదరులే!: సి.రామచంద్రయ్య
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపణలు చేశారు. వారిద్దరూ సహోదరులేనంటూ ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసు మాఫీ చేసుకునేందుకే రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ ను బాబు ఆహ్వానించారని ఆరోపించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామచంద్రయ్య మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. బీహార్ లో బీజేపీ ఓటమిపై టీడీపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పినట్టు వింటే హీరో పవన్ కల్యాణ్ ఇమేజ్ దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు.