: భన్వర్ లాల్ టీఆర్ఎస్ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారు: మర్రి శశిధర్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్న ఆయనపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. వెంటనే తొలగించాలని విలేకరులతో మాట్లాడుతూ ఆయన డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల జాబితా సవరణల్లో చోటుచేసుకుంటున్న అవకతవకలపై తాను ప్రశ్నించానని, అందుకే తనపై కక్ష పెంచుకున్నారని అన్నారు. ప్రభుత్వాధికారిగా పనిచేస్తున్న భన్వర్ లాల్ రాజకీయ నేతలపై ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేయడం మానుకోవాలని చెప్పారు.

More Telugu News