: 127 మంది మృతి చెందారు...మూడు రోజులు సంతాపదినాలు: ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఐఎస్ఐఎస్ ఉద్రవాదులు జరిపిన దాడుల్లో మొత్తం 127 మంది మృతి చెందారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండే తెలిపారు. దారుణ మారణహోమానికి నిరసనగా మూడు రోజులు సంతాపదినాలుగా ఆయన ప్రకటించారు. ఇలాంటి దాడులు తమ సంకల్పాన్ని ఏ మాత్రం మార్చవని, తమను మరింత పటిష్ఠం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. తనను తాను కాపాడుకునే శక్తి ఫ్రాన్స్ కు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి దాడులు తమను ఏమీ చేయలేవని ఆయన తెలిపారు. దీనిని ఉగ్రవాదుల యుద్ధ చర్యగా అభివర్ణించిన ఆయన, దీనికి బీజం విదేశాల్లోనే పడిందని పేర్కొన్నారు. కాగా, ఈ దాడుల్లో 150 మంది మృతి చెందగా, 100 మంది గాయపడ్డట్టు మీడియా వార్తలు వెలువరచగా, 127 మంది మృతి చెందినట్టు హోలండే ప్రకటించారు.