: దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ నైట్ వాయిదా... ఉగ్రదాడులే కారణం

ఈ రోజు సాయంత్రం ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ నైట్ హైదరాబాద్ నిజాంపేట్ లో ఉన్న శ్రీ చైతన్య కాలేజీలో జరగాల్సి ఉంది. ఇదే కార్యక్రమంలో అతను సంగీతం సమకూర్చిన 'కుమారి 21ఎఫ్' సినిమా ప్లాటినం డిస్క్ వేడుకను కూడా నిర్వహించాలని భావించారు. అయితే ఈ వేడుకను వాయిదా వేశారు. ఫ్రాన్స్ పై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంతో... ప్రపంచమంతా విషాదంలో మునిగిపోయిందని... ఈ పరిస్థితుల్లో తాము మాత్రం మ్యూజికల్ నైట్ తో ఎంజాయ్ చేయడం సరి కాదని నిర్వాహకులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ... దేవిశ్రీ ప్రసాద్ మాత్రం కార్యక్రమాన్ని వాయిదా వేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

More Telugu News