: ఒకేసారి 615 మందితో ప్రయాణించే ఎమిరేట్స్ విమానం!

ఆకాశయానంలో అత్యుత్తమ సౌకర్యాలు అందించే 'ఫ్లై ఎమిరేట్స్' సంస్థ ఇప్పుడు విమానయానంలో మరో ముందడుగు వేస్తోంది. 615 మంది ప్రయాణికులను మోసుకుపోయే 'ఏ380 ఎయిర్ బస్' విమానాన్ని ప్రవేశపెడుతోంది. ఒక విమానంలో ఇంతమంది ప్రయాణికులను చేరవేర్చే ఘనతను ఈ సంస్థ సొంతం చేసుకుంటోంది. ఎయిర్ బస్ లలో ఫస్ట్ క్లాస్ (ఎగ్జిక్యూటివ్), బిజినెస్ క్లాస్, ఎకానమీ అనే తరగతులు ఉంటాయి. ఈ విమానంలో ఫస్ట్ క్లాస్ సీట్లను తొలగించింది. దీని ద్వారా సమకూరిన స్థలంలో ఎకానమీ క్లాస్ లో 130 సీట్లను అదనంగా ఏర్పాటు చేయగలిగింది. బిజినెస్ క్లాస్ లో 58 సీట్లను అదనంగా ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం 98 మందిని అదనంగా గమ్యం చేర్చే వెసులుబాటు కలిగింది. దీంతో మొత్తం విమానంలో ఒకేసారి 615 మంది ప్రయాణం చేసే వెసులుబాటు చిక్కింది. సీట్లను పెంచడంపై ఎకానమీ క్లాస్ ను నష్టపోతున్నట్టు భావించాల్సిన అవసరం లేదని, బిజినెస్ క్లాస్ లో 18 సీట్లను పెంచి మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దామని ఫ్లై ఎమిరేట్స్ చెబుతోంది.

More Telugu News