: యూకే గ్రాడ్యుయేట్లకు టీసీఎస్ ల్యాబ్ లలో శిక్షణ
ఇండియాలోని అతిపెద్ద సాఫ్ట్ వేర్ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బ్రిటన్ యూనివర్శిటీల్లో గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేసే 1000 మందికి తమ ఇన్నోవేషన్ ల్యాబ్ లు, డెవలప్ మెంట్ సెంటర్లలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు బ్రిటీష్ కౌన్సిల్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు టీసీఎస్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 2016 నుంచి 2020 మధ్య బ్రిటన్ వర్శిటీల్లో విద్యను పూర్తి చేసుకున్న వారి నుంచి ఎంపిక చేసిన వెయ్యి మందికి సంవత్సరం పాటు శిక్షణ ఉంటుందని వివరించింది. వీరిలో టెక్నికల్, కమర్షియల్, బిజినెస్, డిజిటల్ నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నామని పేర్కొంది.