: బ్రిటన్ లో దావూద్ కు లెక్కలేనన్ని ఆస్తులు... చిట్టా విప్పిన భారత్!
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నేర సామ్రాజ్యం విశ్వవ్యాప్తమైంది. పాకిస్థాన్ లో తలదాచుకుని ఇస్లామిక్ దేశాల్లో చక్కర్లు కొడుతున్న దావూద్ అగ్రరాజ్యాల్లోనూ వ్యాపారాలు చేస్తున్నాడు. అంతేకాదు, అగ్ర రాజ్యాల్లో అతడు ఆస్తులనూ కొంటున్నాడు. తన సంపదను పెంచుకుంటున్నాడు. ఈ తరహా ఆస్తులకు సంబందించి బ్రిటన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఓ చిట్టాను ఆ దేశ ప్రభుత్వానికి అందించనున్నారు. బ్రిటన్ లో దావూద్ చేజిక్కించుకున్న ఆస్తుల వివరాలు సదరు చిట్టాలో ఉన్నట్లు తెలుస్తోంది. సదరు చిట్టాలో డీ గ్యాంగ్ ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
1. లండన్ లోని సెయింట్ జాన్ ఉడ్ రోడ్ లో అతిపెద్ద గ్యారేజీ. దీని కేంద్రంగానే డీ గ్యాంగ్ బ్రిటన్ లో కార్యకలాపాలు సాగిస్తోంది.
2. డార్ట్ ఫోర్డ్ లోని స్పైటాల్ స్ట్రీట్ లో డార్ట్ ఫోర్ట్ హోటల్
3. లండన్ లోని రోహాంప్టన్ హై స్ట్రీట్ లో పలు షాపులు, అపార్ట్ మెంటు
4. లాన్సెలాట్ రోడ్ లోనూ షాపులు, అపార్ట్ మెంట్
5. లండన్ రోహాంప్టన్ స్ట్రీట్ లో ఫ్లాట్
ఇక డీ గ్యాంగ్ కింది ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేసిందట...
1. ససెక్స్ లో హెర్బర్ట్ రోడ్
2. రిచ్ మండ్ రోడ్
3. చిగ్వెల్ లోని టామ్స్ ఉడ్ రోడ్
4. థార్టన్ రోడ్, రామ్ ఫోర్డ్ ఎసెక్స్
5. లండన్ లో షెఫర్డ్ బుష్ గార్డెన్
6. సౌత్ రూయిస్ లిఫ్ లో గ్రేట్ సెంట్రల్ ఎవెన్యూ
7. లండన్ లోని సెయింట్ స్విథిన్స్ లేన్
8. హాయినాల్ట్ లోని ఉడ్ హౌస్ రోడ్