: టైటాన్ పై మంచు మేఘాలున్నాయని నాసా ప్రకటన

శనిగ్రహానికి అతిపెద్ద ఉపగ్రహమైన టైటాన్ పై భారీ స్థాయిలో మంచు మేఘాలున్నాయని నాసా ప్రకటించింది. టైటాన్ ఉపరితలం నుంచి 200 కిలోమీటర్ల ఎత్తులో ఇవి ఉన్నట్టు తెలిపింది. టైటాన్ స్ట్రాటో ఆవరణం దిగువ మధ్య భాగంలో ఇవి ఉన్నట్టు కేసినీ వ్యోమనౌక గుర్తించింది. అయితే భూమిపై ఉన్న పొగమంచు మాదిరిగా ఈ మేఘాలు అత్యంత సాంద్రతను కలిగి ఉన్నాయట. కానీ పైభాగం మాత్రం చదునుగా ఉంది. ఈ మంచు మేఘాలు భూమిపై వర్షాన్నిచ్చే మేఘాల మాదిరిగా ఏర్పడవని, వెచ్చని అర్ధగోళంలోని వాతావరణం నుంచి వేడి వాయువులు దక్షిణార్థగోళంలోని చల్లని ప్రాంతానికి ప్రసరిస్తాయి.

More Telugu News