: బీసీసీఐ నుంచి లిఖితపూర్వక హామీ కావాలి: అఫ్రిదీ డిమాండ్
పాకిస్థాన్ తో సిరీస్ ను నిర్వహించాలనేదే తమ అభిమతమని బీసీసీఐ చేసిన ప్రకటనపై పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ స్పందించాడు. భారత్ వెళ్లి క్రికెట్ ఆడటానికి తాము సిద్ధంగా ఉన్నామని... అయితే, బీసీసీఐ ఏదైతే చెబుతుందో దానికి సంబంధించి లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇదే విషయాన్ని పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ కూడా ఇప్పటికే వెల్లడించారు. అఫ్రిది మాట్లాడుతూ, షహర్యాన్ ఖాన్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పాడు.
2012-13లో తాము ఇండియాలో సిరీస్ ఆడినప్పుడు బీసీసీఐకి కోట్లాది రూపాయల ఆదాయం సమకూరిందని... పీసీబీకి ఏమీ రాలేదని అఫ్రిదీ చెప్పాడు. ఈ క్రమంలో, ఇప్పుడు ఇండియాలో పాకిస్థాన్ క్రికెట్ ఆడితే... పీసీబీకి ఎంత రెవెన్యూను ఇస్తారనే విషయాన్ని బీసీసీఐ లిఖితపూర్వకంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు.