: ఇకపై ఇంటర్ నెట్ లేకున్నా గూగుల్ మ్యాప్


ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఇక నుంచి గూగుల్ మ్యాప్ సేవలను నెట్ లేకుండానే అందించబోతోంది. ఇందుకోసం ఓ కొత్త సాఫ్ట్ వేర్ ను గూగుల్ రూపొందించింది. దాని ద్వారా ఆఫ్ లైన్ లోనూ నావిగేషన్ సిస్టమ్ పనిచేయనుంది. అందుకోసం మనకు కావలాల్సిన ఆఫ్ లైన్ ఏరియాను ముందుగా డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత నెట్ సౌకర్యం లేకపోయినా అంటే ఆఫ్ లో ఉన్నా నావిగేషన్ ను పొందవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఫోన్ లలో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఐవోఎస్ ఫోన్ లో కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని గూగుల్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News