: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కడప జిల్లా మహిళ అరెస్ట్... 4.5 కిలోల బంగారం స్వాధీనం

హైదరాబాదు శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి అక్రమ మార్గాల్లో తరలివస్తున్న బంగారానికి బ్రేకులు పడటం లేదు. ఇప్పటికే కిలోల లెక్కన తరలివచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నేటి ఉదయం బ్యాంకాక్ నుంచి వచ్చిన విమానంలో భారీగా బంగారం తరలివస్తోందన్న సమాచారంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా సదరు విమానంలో వచ్చిన కడప జిల్లాకు చెందిన మల్లీశ్వరి అనే మహిళను పోలీసులు తనిఖీ చేశారు. మల్లీశ్వరి బ్యాగేజీలో కిలోల కొద్దీ బంగారాన్ని చూసిన కస్టమ్స్ అధికారులు షాక్ తిన్నారట. వెనువెంటనే తేరుకుని మల్లీశ్వరిని అరెస్ట్ చేయడంతో పాటు ఆమె బ్యాగేజీలోని 4.5 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News