: హెల్మెట్ లేకుంటే జరిమానా తప్పదు!...కఠిన నిబంధనల అమలుకు ఏపీ సర్కారు శ్రీకారం

ఏపీలో బైకెక్కాలంటే ఇకపై హెల్మెట్ తప్పనిసరి. హెల్మెట్ నిబంధన అమలుపై ఇటీవల కార్యరంగంలోకి దిగిన చంద్రబాబు సర్కారు, పోలీసుల వసూళ్ల దందాతో వెంటనే వెనకడుగు వేయాల్సి వచ్చింది. అయితే రోడ్డు ప్రమాదాల్లో మరణాల నివారణకు కంకణం కట్టుకున్న ఏపీ ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని మార్చుకుంది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా హెల్మెట్ నిబంధనను అమల్లోకి తెచ్చింది. అంతేకాక హెల్మెట్ నిబంధనను పక్కాగా అమలు చేసేందుకు సంకల్పించింది. బైక్ పై హెల్మెట్ లేకుండా తొలి సారి కనిపిస్తే రూ.100 జరిమానా వసూలు చేయాలని నిర్ణయించింది. రెండోసారి కూడా హెల్మెట్ లేకుండా కనిపించే వ్యక్తుల బైకులను పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. నేటి ఉదయం అమల్లోకి వచ్చిన హెల్మెట్ నిబంధనను కాస్తంత కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది.

More Telugu News