: మరణించిన వారికి సైతం వివాహం...అక్కడ అదే వింత ఆచారం!

ఉత్తరాఖండ్ లోని షహారన్ పూర్ జిల్లాలో మీర్పూర్-మోహన్ పూర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో నట్బాజీ సమాజంలో ఓ ఆచారం వుంది. అదే మరణించిన వారికి కూడా పెళ్లి చేయడం! తాజాగా అలాగే ఓ వివాహం జరిగింది. ఆ కులానికి చెందిన రామేశ్వర్ అనే వ్యక్తికి ఓ కుమార్తె ఉండేది. ఆమె రెండేళ్ల వయసప్పుడే మృతి చెందింది. ఆమె మరణించి ఇప్పటికి 18 ఏళ్లైంది. దీంతో వారి కులాచారం ప్రకారం ఆమె పెళ్లీడుకొచ్చింది. ఆమెకు వివాహం చేయాలి. ఆమె బతికి లేదు కదా? మరి వరుడు ఎవరు? అంటే ఆమెలాగే చిన్నప్పుడే మరణించిన మరో పురుషుడితో వివాహం చేయాలి. మరణించిన వారిద్దరిని తలచుకుని వధూవరులుగా రెండు బొమ్మలు తయారుచేశారు. ఆ రెండు బొమ్మలకు హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిపించారు. ఈ వివాహానికి కట్నకానుకలు కూడా ఇవ్వాల్సిందే. ఈ సంప్రదాయం నట్బాజీ సంఘంలో తరతరాలుగా వస్తోంది.

More Telugu News