: సెక్యూరిటీ గార్డు నిద్ర...ఏటీఎం ఎత్తుకెళ్లిన దొంగలు
సెక్యూరిటీ గార్డు గాఢనిద్రలో ఉండగా, దొంగలు ఏటీఎంను ఎత్తుకుపోయిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. జైపూర్ కు 60 కిలోమీటర్ల దూరంలోని భైన్సావా ప్రాంతంలో ఓ జాతీయ బ్యాంకు ఏటీఎం వద్ద కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డు గాఢనిద్రలో ఉండగా ఏటీఎంలోకి ప్రవేశించిన దుండగులు చోరీకి యత్నించారు. అయితే వారి ప్రయత్నం విఫలమై ఏకంగా ఏటీఎంనే లేపేశారు. నిద్రలోంచి మేల్కొన్న సెక్యూరిటీ గార్డు ఏటీఎం మెషీన్ లేకపోవడంతో లబోదిబోమంటూ బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏటీఎంలో 26.76 లక్షల రూపాయలు ఉన్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఏటీఎం దొంగల కోసం గాలింపు చేపట్టారు.