: ఆంధ్రా ప్రజల ఏడుపు తగిలే బీహార్ లో బీజేపీ మట్టికొట్టుకుపోయింది: రాయపాటి

బీహార్ లో బీజేపీ ఘోర పరాజయంపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చురకలు వేశారు. ఈ మేరకు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా ప్రజల ఏడుపు తగిలే బీహార్ లో బీజేపీ మట్టికొట్టుకుపోయిందని గుంటూరులో మండిపడ్డారు. బీహారీలు, కాశ్మీరీలకు లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చిన ప్రధాని మోదీ, అమరావతి శంకుస్థాపనకు వచ్చి మట్టి ఇచ్చిపోతారా? అని ప్రశ్నించారు. బీహార్ లో బీజేపీ ఓటమిపై రాయపాటి వంటి తెలుగుదేశం నేత ఇలా మాట్లాడడంతో పార్టీ వర్గాలలో ఇది సంచలమైంది.

More Telugu News