: కార్యరంగంలోకి ‘గ్రేటర్’ కొత్త కమిషనర్...స్మార్ట్ సిటీపై ప్రజలతో మమేకమైన జనార్దన్ రెడ్డి

గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి ఇక కార్యరంగంలోకి దిగేశారు. స్మార్ట్ సిటీకి సంబంధించి సలహాలు, సూచనలు అందించాలని ఆయన ప్రజలను కోరారు. నేటి ఉదయం కార్యాలయం నుంచి బయటకు వచ్చిన జనార్దన్ రెడ్డి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలో హైదరాబాదు కూడా ఉన్న సంగతి తెలిసిందే. స్మార్ట్ సిటీ పథకం కింద చేపట్టాల్సిన అభివృద్ధిపై ప్రణాళిక రూపకల్పనలో భాగంగా ప్రజల అభిప్రాయాలకు కూడా పెద్ద పీట వేయాలని జనార్దన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతూ ప్రజలతో మమేకమయ్యారు.

More Telugu News