: నితీశ్ ను కలిసిన బీజేపీ నేత శతృఘ్నసిన్హా... చర్చలు!
బీజేపీ నేత, వెటరన్ బాలీవుడ్ హీరో శతృఘ్నసిన్హా ఈ మధ్యాహ్నం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను కలిశారు. ఆయన నివాసానికి వెళ్లి కాసేపు చర్చలు జరిపి వచ్చిన శత్రు మీడియాతో మాట్లాడుతూ, నితీశ్ లోని నాయకత్వ లక్షణాలపై పొగడ్తల వర్షం కురిపించారు. పశ్చిమ బెంగాల్ లో జ్యోతీ బసూ అంతటి గొప్పవాడని అన్నారు. తానెన్నడూ బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లలేదని, పార్టీ తనపై చర్యలు తీసుకుంటే తాను చేసేదేమీ లేదని అన్నారు. కాగా, ఇటీవలి ఎన్నికల్లో సిన్హాను ప్రచారానికి ఆహ్వానించకుండానే బీజేపీ ముందుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, శతృఘ్నసిన్హా, నితీశ్ ల కలయిక బీహార్ లో కొత్త పరిణామాలకు దారితీస్తుందేమో వేచి చూడాలి.