: హాస్య నటుడు అలీకి వ్యతిరేకంగా విశాఖలో మహిళా సంఘాల ధర్నా... క్షమాపణలతో శాంతించిన ఆందోళనకారులు

సినీ హాస్య నటుడు అలీకి వ్యతిరేకంగా విశాఖపట్నంలో మహిళా సంఘాలు ఆందోళన చేశాయి. నగరంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఓ హోటల్ లో దిగినట్టు మహిళా చేతన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలుసుకున్నారు. వెంటనే అక్కడికి వెళ్లి ధర్నా చేశారు. ఓ ప్రముఖ టీవీ చానెల్ లో అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమంలో మహిళలను ఉద్దేశించి ద్వంద్వార్థాలు వచ్చేలా అభ్యంతరకరంగా మాట్లాడుతూ వారిని అగౌరవపరుస్తున్నారని వీరు ఆరోపించారు. దీంతో అలీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది తెలిసి హోటల్ వద్దకు వచ్చిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈలోగా అలీ తాను క్షమాపణ చెబుతున్నానని వర్తమానం పంపడంతో వారు శాంతించారు. కాగా, ఇటీవల 'సైజ్ జీరో' ఆడియో ఫంక్షన్ లో నటి అనుష్కపై అలీ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపిన సంగతి తెలిసిందే.

More Telugu News