: దీపికా పదుకొనె 'జిల్లెట్ రేజర్' వాణిజ్య ప్రకటనపై అభ్యంతరం... ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొనె నటించిన 'జిల్లెట్ రేజర్' ప్రకటనపై అభ్యంతరం వ్యక్తమైంది. ఆ ప్రకటన వల్ల తమ హెయిర్ రిమూవల్ క్రీమ్ అమ్మకాలు దారుణంగా పడిపోతాయని, అందులో ఆమె నటించకుండా ఆపాలంటూ రెకిట్ బెన్ కిసర్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని జస్టిస్ బదర్ దుర్రెరజ్ అహ్మద్, జస్టిస్ సంజీవ్ సచ్ దేవ్ ల నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. జిల్లెట్ వారి వీనస్ రేజర్ ప్రకటన తమ ఉత్పత్తి వీట్ హెయిర్ రిమూవల్ క్రీమ్ పేరు చెడగొట్టేలా ఉందని రెకిట్ వాదించారు. ఆ ప్రకటన వీడియోలో స్పాట్యూలా అనే పరికరాన్ని చూపుతున్నారని, దాన్ని తమ క్రీమ్ వాడేందుకు ఉపయోగిస్తారని తెలిపారు. అందుకే ఆ ప్రకటనను ఆపడం లేదా స్పాట్యూలాను కనీసం బ్లర్ చేయడం లేదా మాస్క్ చేయడం తప్పనిసరిగా చేయాలని వాదించారు. అంతేగాక ప్రకటనలో దీపికా నటించడంవల్ల మరింత ప్రచారం వస్తుందని తెలిపారు. అయితే ఈ అంశంలో రెండో పక్షం వాదనలు కూడా విన్న తరువాతే నిర్ణయం చెప్పగలమని ధర్మాసనం పేర్కొంది. అంతవరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. ఈ క్రమంలో 'ప్రోక్టర్ అండ్ గాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్ లిమిటెడ్', 'జిల్లెట్ ఇండియా లిమిటెడ్ కంపెనీ'లకు నోటీసులు జారీ చేసింది. త్వరలో సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

More Telugu News