: కేసీఆర్ కూ పరాభవం తప్పదు: షబ్బీర్ అలీ
బీహార్ లో ప్రధాని మోదీకి ఎదురైనటువంటి అనుభవమే, వరంగల్ లో జరగనున్న ఉపఎన్నికలో సీఎం కేసీఆర్ కు ఎదురవుతుందని తెలంగాణ శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ జోస్యం చెప్పారు. మహాకూటమి విజయంతో గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్, షబ్బీర్ అలీతో పాటు పలువురు కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మతతత్వ రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి బీహార్ ప్రజలు గుణపాఠం చెప్పారన్న ఆయన ఈ తాజా పరిణామాలు బీజేపీ పతనాన్ని సూచిస్తున్నాయన్నారు. మతతత్వ ఎజెండాతో వెళ్లిన ఎంఐఎంను కూడా బీహార్ లో తిరస్కరించారన్నారు.