: నితీశ్-లాలూకి వైఎస్ జగన్ అభినందనలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించిన నితీశ్‌కుమార్, లాలు ప్రసాద్ యాదవ్ లను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ అభినందించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్విట్టర్ సందేశాన్ని పంపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా ఒక్కటైన నితీశ్, లాలు అపూర్వ విజయాన్ని సాధించారన్నారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో జేడీయూ, ఆర్జేడీ కూటమి 178 స్థానాలతో తిరుగులేని మెజారిటీ సాధించి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుందని జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.