: సహనటిపై చిందులు తొక్కిన సల్మాన్ ఖాన్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సహనటి రిమిసేన్ పై చిందులుతొక్కాడు. కలర్స్ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ 9 షో వ్యాఖ్యాతగా సల్లూభాయ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నేటి షోలో రిమిసేన్ పై సల్లూ భాయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. షోలో పాల్గొన్న నాటి నుంచి రిమిసేన్ ఎలాంటి ఆసక్తికర ప్రదర్శన చేయకపోవడంపై సల్లూభాయ్ మండిపడ్డాడు. బిగ్ బాస్ షోలో కనీసం పార్టిసిపేట్ చేయాలని సూచించాడు. బాలీవుడ్ మొత్తం ఆమెను గమనిస్తోందని రిమిసేన్ కు చెప్పాడు. భవిష్యత్ కోసం లేదా ఆమెను అభిమానించే వారి కోసమైనా ఆమె బిగ్ బాస్ షోలో భాగం కావాలని సల్మాన్ కోరాడు. అభిమానులను నిరాశపరచవద్దని సల్లూభాయ్ హితవు పలికాడు.