: దర్శకరత్న దాసరి మరోసారి సంచలన కామెంట్స్
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఎలుకా మజాకా' సినిమా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఈ మధ్య జరుగుతున్న ఆడియో వేడుకలు జాతరలో రికార్డింగ్ డ్యాన్సులను తలపిస్తున్నాయని అన్నారు. హాలీవుడ్ లో ప్రతి ఏటా జరిగే ఆస్కార్ వేడుకలను చూసి మనవాళ్లు వాతలు పెట్టుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అనుకరించడం మానాలని ఆయన సూచించారు. అయితే ఎలుకా మజాకా సినిమా ఆడియో వేడుక మాత్రం ఫ్యామిలీ వేడుకలా జరుగుతోందని అభినందించారు. అలాగే పెద్ద సినిమాలు ఏడాదిలో ఎప్పుడు విడుదలైనా ఫర్వాలేదని చెప్పిన ఆయన, చిన్న సినిమాలను మాత్రం పండగల సందర్భాల్లో విడుదల చేయాలని ఆయన సూచించారు. వెన్నెల కిషోర్ మంచి టైమింగ్ ఉన్న నటుడని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా అందర్నీ అలరిస్తుందని ఆయన ఆకాంక్షించారు.