: కాపులకు ముష్టి వేసి మభ్యపెడుతున్నారు: బొత్స

కాపులకు రూ. 100 కోట్ల ముష్టి పడేసి మభ్యపెడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. కాపులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎవరితోనైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించారా? అని నిలదీశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని... వరికి రూ. 2వేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛభారత్ కోసం పన్ను వేయడాన్ని తప్పుబట్టారు.

More Telugu News