: చైనాను అందుకోవడం కాదు... దాని తలదన్నుతాం: మోదీ

జమ్మూకాశ్మీర్ శ్రీనగర్ లోని షేర్-ఈ-కాశ్మీర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. చైనాను భారత్ ఎన్నడూ అందుకోలేదని గతంలో అంతా అనేవారని... ఇప్పుడు చైనాను అందుకోవడమే కాదు, దాని తలదన్నుతామని చెప్పారు. ఇదే విషయాన్ని ఇప్పుడు అందరూ చెబుతున్నారని తెలిపారు. అన్ని విధాలుగా భారత్ పురోగమిస్తోందని... దేశాభివృద్ధిలో భారత్ లోని ప్రతి ప్రాంతాన్ని భాగస్వామిని చేయాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. 'ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్' రిపోర్టును ఇక్కడకు బయల్దేరే ముందు తాను చదివానని... గత 50 ఏళ్లలో తొలిసారి చైనాను భారత్ అధిగమించిందని అందులో ఉందని మోదీ వెల్లడించారు. రూ. 34 వేల కోట్లతో జమ్ము-శ్రీనగర్ హైవేను నిర్మిస్తామని... దాంతో, ప్రయాణ సమయం 12 గంటల నుంచి మూడున్నర గంటలకు తగ్గిపోతుందని చెప్పారు.

More Telugu News