: వరంగల్ లో జగన్ ప్రచారం చేస్తారు... మా అభ్యర్థి విజయం సాధిస్తారు: ఎంపీ పొంగులేటి

వరంగల్ లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి విజయంపై ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. వరంగల్ ఎంపీ స్థానాన్ని అక్కడి ప్రజలు వైసీపీకే కట్టబెడతారని ఆ పార్టీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం లోటస్ పాండ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ప్రభంజనం ముందు ఏ పార్టీ నిలవలేదన్నారు. ఈ నెల 16, 17, 18, 19 తేదీల్లో వరంగల్ ఎంపీ స్థానంలో ఉన్న ప్రతి సెగ్మెంట్లలో జరిగే ప్రచారంలో జగన్ పాల్గొంటారని చెప్పారు. జగన్ ప్రచారంతో తమ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ గెలుపొందుతారన్నారు.

More Telugu News