: తల్లిదండ్రులు వదిలేసిన బాలికకు సినీ నటుడు జగపతిబాబు తల్లి ఆర్థిక సాయం

హీరో జగపతి బాబు తల్లి వసుంధరాదేవి ఓ బాలికకు ఆర్థిక సాయం చేశారు. తల్లిదండ్రులు వదిలేసి వెళ్లడంతో చందన అనే బాలిక హైదరాబాద్ లోని మణికొండలో నాయనమ్మ దగ్గర పెరుగుతోంది. అప్పటికే తను నాలుగో తరగతి చదువుతోంది. దాంతో చదువుకునేందుకు ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని ఓ టీవీ చానల్ ప్రసారం చేసి, బాలిక సమస్యను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఇందుకు స్పందించిన జగపతిబాబు తల్లి రూ.20వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆ మొత్తాన్ని జగపతిబాబు ఆ బాలికకు అందజేశారు.

More Telugu News