: కన్నా లక్ష్మీనారాయణ తండ్రి సైకిళ్లకు పంక్చర్లు వేసుకునేవారు: మంత్రి రావెల తీవ్ర వ్యాఖ్యలు
బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నా తండ్రి సైకిళ్లకు పంక్చర్లు వేసుకునేవారని... అలాంటి వ్యక్తి కుమారుడు ఇప్పుడు వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యారని, ఏ రకంగా సంపాదించారని ప్రశ్నించారు. టీడీపీపై బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, కావూరి సాంబశివరావులు చేస్తున్న విమర్శలు గురివింద గింజ తరహాలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. వీరి వ్యాఖ్యలను వారి వ్యక్తిగతమైనవిగానే చూస్తున్నామని... బీజేపీకి, వీరి వ్యాఖ్యలకు సంబంధం లేదని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా ఏపీలో ఒకే పార్టీ ఉంటుందని... అది టీడీపీనే అని అన్నారు.