: పిచ్చి వాగుడు వద్దు... దమ్ముంటే మోదీ దగ్గర నోరెత్తు: సోము వీర్రాజుపై కారెం శివాజీ ఫైర్
ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్న వారిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ప్రత్యేక హోదా సాధన సమితి నేత కారెం శివాజీ మండిపడ్డారు. 'పిచ్చి మాటలు మాట్లాడటం కాదు... దమ్ముంటే ప్రధాని మోదీ వద్ద నోరెత్తు' అంటూ సోము వీర్రాజుపై ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులు చొరవ తీసుకొని... ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని కోరారు.