: అశ్విన్ దెబ్బకు కుప్పకూలుతున్న సఫారీలు
స్పిన్ కు అనుకూలిస్తున్న మొహాలీ పిచ్ పై టీమిండియా టాప్ స్పిన్నర్ అశ్విన్ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. బంతిని మెలికలు తిప్పుతూ సఫారీ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూలుస్తున్నాడు. 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమ్లాను, ఆ తర్వాత వచ్చిన డేన్ విలస్ (1)లను అశ్విన్ వరుసగా బలిగొన్నాడు. ఆమ్లా స్టంప్ ఔట్ కాగా, జడేజాకు క్యాచ్ ఇచ్చి డేన్ వెనుదిరిగాడు. ఈ క్రమంలో, అశ్విన్ ఈ ఇన్నింగ్స్ లో ఇప్పటి వరకు మొత్తం 4 వికెట్లను పడగొట్టాడు. డీవిలియర్స్ (26), ఫిలాండర్ (2)లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం లంచ్ విరామ సమయానికి సౌత్ ఆఫ్రికా స్కోరు 5 వికెట్ల నష్టానికి 127 పరుగులు.