: గుంటూరు జిల్లా అనంతవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయం ప్రధాన తలుపులను పగులగొట్టి దొంగలు హుండీని ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న తుళ్లూరు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. రాజధాని ప్రకటన తరువాత ఈ ఆలయానికి భక్తుల రాక పెరిగింది. దాంతో హుండీలో ఎంత సొమ్ము ఉందో సరిగా అంచనా వేయలేకపోతున్నారు. మరోవైపు టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయాన్ని చిన్న తిరుపతిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలే ఈ ఆలయాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంది.

More Telugu News