: బాలీ ఎయిర్ పోర్టుకు చోటా, కాసేపట్లో బయలుదేరనున్న విమానం

చోటా రాజన్ భారత తరలింపులో ఇండొనేషియా ప్రభుత్వంతో జరపాల్సిన లాంఛనాలన్నీ పూర్తికాగా, ఆయన్ను కొద్దిసేపటి క్రితం సీబీఐ, ముంబై పోలీసుల ప్రత్యేక బృందానికి ఇంటర్ పోల్ అధికారులు అప్పగించారు. ఆ వెంటనే చోటా రాజన్ ను బాలీ విమానాశ్రయానికి అధికారులు తీసుకొచ్చారు. మరికాసేపట్లో బాలీ విమానాశ్రయం నుంచి బయలుదేరే ప్రత్యేక విమానం రాత్రికి ముంబై చేరుకుంటుందని తెలుస్తోంది. ఆయన్ను ముంబైకి తీసుకురాగానే పోలీసు అధికార కార్యాలయానికి తరలించనున్నారు. చోటా రాజన్ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న సమాచారంతో ఇప్పటికే ముంబై పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News