: ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి

ఏపీకి ప్రత్యేక హోదా సీమాంధ్రుల హక్కు అని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఈ హక్కును సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ప్రత్యేక హోదాను మోదీ ఇస్తారనే నమ్మకం తమకు ఉందని తెలిపారు. పట్టిసీమతో నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. అమరావతిని అద్భుతంగా నిర్మిస్తామని తెలిపారు. మరోవైపు, ఏపీకి ప్రత్యేక హోదా తమ హక్కు అంటూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్న టీడీపీ నేతల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.

More Telugu News