: ట్విట్టర్లో 'లైక్' బటన్ మారింది
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో లైక్ బటన్ సింబల్ మారనుంది. ఇష్టాన్ని వ్యక్తపరిచేందుకు స్టార్ సింబల్ అంత గొప్పగా లేదని భావించిన ట్విట్టర్ ఈ మేరకు మార్పులు చేసింది. ఇష్టాన్ని మరింత బాగా వ్యక్తీకరించేందుకు ఏ సింబల్ అయితే బాగుందని ఆలోచించిన ట్విట్టర్, హృదయాకారం (లవ్ సింబల్) అయితే బాగుంటుందని భావించింది. దీంతో ఈ సింబల్ నే ఖరారు చేసింది. దీంతో ఇంత వరకు ట్విట్టర్ లో లైక్ బటన్ గా కనిపించిన స్టార్ స్థానంలో హృదయాకారం కనిపించనుంది. అయితే దీనినే ఉంచుకోవాలనే నిబంధనేదీ లేదని, స్టార్ బటనే బాగుందని భావించే వారు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ నుంచి వెబ్ స్టోర్ లోకి వెళ్లి స్టార్ ను తిరిగి ఇన్ స్టాల్ చేసుకోవచ్చని ట్విట్టర్ తెలిపింది.